మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల బ్యూరో
_ ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ చట్టం ప్రకారం పంపిణీ
_ 46 మందికి 36 లక్షల 87వేల 500 లు బ్యాంక్ ఖాతాల్లో జమ
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా మండల గ్రామాల్లో ని ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసుల కింద నష్ట పరిహారం పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని ఆయా మండలాల్లో నమోదైన ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసుల ఆధారంగా మొత్తం 46 మందికి రూ.36,87,500 పరిహారం వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.