మన ప్రగతి న్యూస్ /రామన్నపేట:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో మల్లికార్జున బిన్ని రైస్ మిల్లు దగ్గరలోని షట్టర్ లో ఉన్న 50 క్వింటాళ్ళ పి.డి.ఎస్ బియ్యాన్ని పౌరసరఫరా శాఖ అధికారులు, ఎన్ఫోర్స్ మెంట్ టాస్క్ ఫోర టీమ్.1 అధికారులు కలిసి పట్టుకొని సీల్ చేసి ప్రభుత్వ గోదాముకు తరలించి మిల్లు యజమాని సిరికొండ రామాంజనేయులు పై కేసు నమోదు చేసినారు అని
పౌరసరఫరా శాఖ డిప్యూటీ తహసిల్దార్ బాలమణి సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపినారు.