Breaking News

అప్పుల బాధతో కౌలు రైతు మృతి

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందినా మోటే కళమ్మ భర్త/మృతుడు అయిన మోటే నరసింహ S/o బుచ్చయ్య వయస్సు 50 సం// రాలు తన గ్రామం లో 14 ఎకరాల భూమిని కౌలుకు తీసుకోని వరిపంట వేయగా బోర్లు ఎండిపోవడంతో నీళ్ళు లేక కొంత పంట ఎండి పోయినది.పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎలా తిర్చలో తెలియక మరియు తన కూతురు పెళ్లి ఎలాచేయాలో తెలియక తన భార్యకు బాధపడుతూ చెప్పినాడని,తేది 10.03.2025 సోమవారం ఉదయం 7.00 గంటలకు తానూ కౌలుకు తీసుకున్న పొలం వద్దకు వెళ్లి పంటకు వేసే పురుగుల మందు త్రాగి ఇంటికి వచ్చి పడిపోయి అపస్మారక స్థితికి వెళ్ళగానే పిర్యాది కేకలు వేయడం తో చుట్టూ పక్కల వాళ్ళు రావడంతో వారి సహాయంతో రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించగా అక్కడ పరీక్షించిన డాక్టర్లు మృతి చెందినాడని చెప్పినారని పిర్యాదు రాగా కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నానని SI రామన్నపేట ఒకప్రకటనలో తెలిపినారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం