Breaking News

రిమ్మనగూడలో మహిళా దారుణ హత్య,పరారీలో నిందితుడు

_భార్యను హత్య చేసిన రెండో భర్త

  • చూడడానికి వఛ్చి కడతీర్చి

మనప్రగతి న్యూస్ గజ్వేల్/ రూరల్:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

భార్యను చూడడానికి వచ్చిన రెండో భర్త దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో సోమవారం ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది.గజ్వేల్ సిఐ సైదా తెలిపిన వివరాల ప్రకారం రిమ్మనగూడ పెట్రోల్ బంక్ లో సాదత్ ఉల్ అనే వ్యక్తి గత ఏడాదికాలంగా వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు.అతని భార్య ఆస్రా (45) గత నాలుగేళ్లుగా హైదరాబాదులో ఒక లాయర్ వద్ద పనిచే చేసింది.ఈ సమయంలో మధ్యప్రదేశ్ కు చెందిన అస్లాం అనే బట్టల వ్యాపారితో పరిచయమై పెళ్లి చేసుకుని మధ్యప్రదేశ్ వెళ్లారు. విషయం తెలుసుకున్న భర్త సాదత్ ఉల్, అతని కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నివాసం ఉంటున్న అస్లాం అస్రా లను కలిసి విషయం తెలుసుకుని ఇరు కుటుంబాలు అన్యోన్యంగానే బంధుత్వాన్ని కొనసాగిస్తున్నారు. గత రెండేళ్ల క్రితం ఆస్రా తనను రెండో భర్త అస్లాం వేధింపులకు గురి చేస్తున్నాడని ఫోన్ ద్వారా మొదటి భర్త సాదత్ ఉల్,తన పిల్లలకు సమాచారం అందించింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇందూర్ పోలీస్ స్టేషన్లో అస్లంపై కేసు నమోదు చేశారు.కొద్ది రోజులకు అస్రా హైదరాబాద్కు వచ్చేసింది.గత రెండు రోజుల క్రితం అస్లాం హైదరాబాద్లోని అస్రా వద్దకు వచ్చాడు. తనతో రావాలని అస్లం అస్రాను బతిమిలాడాడు.దీంతో అస్రా అస్లాము తీసుకొని రిమ్మనగూడ పెట్రోల్ బంక్ లో ఉంటున్న మొదటి భర్త సాదత్ ఉల్ దగ్గరకు ఆదివారం వచ్చింది. ముగ్గురు రాత్రి కలిసి విందు చేసుకున్నారు.రాత్రి అస్లాం తన పై పెట్టిన కేసును విరమించుకోవాలని ఇందుకు రావాలని అస్రా ను కోరాడు.ఇందుకు అస్రా ఎంతకు ఒప్పుకోకపోవడంతో ఉదయం ఏడు గంటల సమయంలో గది బయటకు వచ్చిన అస్రా ను పారతో అస్లాం గట్టిగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు.అస్లాంను అడ్డుకోవడానికి ప్రయత్నించిన సాధత్ ఉల్ ను కూడా గాయపరచడంతో అతను దూరంగా పారిపోయాడు.తీవ్రంగా గాయాల పాలైన అస్రా అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న గజ్వేల్ పోలీస్ సిఐ సైదా తన సిబ్బందితో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం వివరాలు సేకరించింది. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.