Breaking News

ధ్యానం తో సంపూర్ణ ఆరోగ్యం…..

మన ప్రగతి న్యూస్ /ఆత్మకూరు

ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ నెస్ సెంటర్ కోఆర్డినేటర్ శారద అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెట్ సెంటర్ ఆధ్వర్యంలో ధ్యానోత్సవం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధ్యానముకు సంబంధించిన ప్రక్రియలను వివరించారు. అన్ని వర్గాల ప్రజలు నిత్యం ధ్యానం చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యాలు మెరుగుపడతాయని అన్నారు. మంగళ బుధవారాలు కూడా ధ్యానం అభ్యసన కొనసాగుతుందని ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆమె కోరారు. కార్యక్రమంలో శ్రీ రామచంద్ర మిషన్ మేనేజర్ వెంకటస్వామి, శిక్షకురాలు మాధవి లత, ధ్యాన శిబిరం కన్వీనర్ టింగిలికారి సత్యనారాయణ, సభ్యులు శ్రీలత పద్మావతి వెంకటస్వామి ఉప్పలయ్య లక్ష్మణాచారి, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం