Breaking News

అక్రమ కట్టడాన్ని తొలగించాలి.

–తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈసం సుధాకర్.

మనప్రగతి న్యూస్/మహబూబాబాద్ జిల్లా బ్యూరో :

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

గూడూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని తొలగించకపోతే తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆక్రమిస్తామని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈసం సుధాకర్ అన్నారు.సోమవారం గూడూరు మండల కేంద్రంలోని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అత్యవసర సమావేశం మండల ప్రధాన కార్యదర్శి పడిగే నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగినది.ఈసందర్బంగా తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షు లు ఈసం సుధాకర్,రాష్ట్ర కార్యదర్శి పాడిగే నాగేశ్వరరావు,జేఏసీ కన్వీనర్ కొట్టెం ముఖర్జీ హాజరై మాట్లాడుతూ ఐదవ షెడ్యూలు ఏజెన్సీ గ్రామం గూడూరు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కన గల ట్రైబల్ పట్టా భూములలో 1/59,1/70,షెడ్యూల్ ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా నిర్మించినటువంటి అక్రమ నిర్మాణం,ప్రభుత్వ ఆసుపత్రి పక్కన అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని,అట్టి అక్రమ కట్టడాన్ని ఆదివాసి ట్రైబల్ పట్టా భూమిలో అక్రమంగా నిర్మించారనీ,అట్టి భూమిలో అక్రమ నిర్మాణంపై జిల్లా యంత్రాంగం ఆర్డిఓ, తహసీల్దార్ వెంటనే స్పందించాలని అక్రమ కట్టడాన్ని పిల్లర్ నిర్మాణాలను తొలగించాలని,లేని పక్షంలో తొలగించని యెడల తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కట్టడాలను తొలగిస్తామని,ప్రభుత్వానికి తెలియజేస్తున్నామనీ,
ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని,అక్రమ నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికైనా స్పందిస్తూ చర్యలు తీసుకుంటూ అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేసి,వెంటనే తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మంగయ్య, సునీల్,మల్లేష్,వజ్రయ్య,నాగేష్,లచ్చయ్య,వెంకన్న, సురేందర్,పాల్గొన్నారు.