–కాంగ్రెస్ పార్టీ మానుకోట జిల్లా కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు నాయక్.
మనప్రగతి న్యూస్/మహబూబాబాద్ జిల్లా బ్యూరో:
ఎవరికీ ఏ ఆపద వచ్చిన నేనున్నాను అదైర్య పడకండి భరోసాను కల్పిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా అందరికీ ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ గూడూరు అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తు, నాకున్న దానిలో ఎంతో కొంత, సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న వాంకుడోత్ కొమ్మాలు నాయక్ గూడూరు గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. సోమవారం మహబూబాబాద్ గూడూరు మండల కేంద్రంలో జిల్లా హోం గార్డుల అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో హోంగార్డుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికై తన వంతు సహాయంగా15వేల రూపాయలు అందజేసినారు. ఈ సందర్భంగా జిల్లా హోంగార్డుల పక్షాన వాంకు డోత్ కొమ్మాలు నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కొమ్మాలు నాయక్ మాట్లాడుతూ గూడూరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని, ఎవరు అధైర్య పడవద్దని, గూడూరు గ్రామంలో మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్ సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని,ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నానని తెలిపారు. గూడూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డి, చంటి స్వామి,హోంగార్డుల అసోసియేషన్ అధ్యక్షులు జన్ను జంపయ్య,జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి ఎండి రసూల్, టౌన్ అధ్యక్షులు రాసమల యాకయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు,మండల కాంగ్రెస్ నాయకులు,హోంగార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.