Breaking News

భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ పేమెంట్ అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో మంగళవారం
వెలుగు కార్యాలయంలో అవగాహన సదస్సుకు ముంబై నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏజీ ఎం రాధిక భరత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిజిటల్ పేమెంట్ లపై అప్రమత్తంగా ఉండండి. డిజిటల్ చెల్లింపులు సులభమైనవి ఎవరైనా ఇంకా ఎవరి చేతనైనా వాడొచ్చు.డిజిటల్ పేమెంట్స్ మీకు ఏ సమయంలోనైనా ప్రతి సమయంలో ఫండ్ పంపించే సౌకర్యతని కలిగిస్తుంది.డిజిటల్ చెల్లింపులు ఎక్కడి నుంచైనా మరియు ప్రతిచోట నుంచి చేయవచ్చు. అదేవిధంగా తక్షణ హెచ్చరికలు పొందేందుకు మీ మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ని మీ బ్యాంకులో రిజిస్టర్ చేసుకోండి.ముఖ్యమైన బ్యాంకింగ్ డేటాని మొబైల్, ఇమెయిల్ ఇంకా వాలెట్ లలో దాచకండి .బ్యాంకింగ్ పాస్వర్డ్ మరియు పిన్ ని తరచుగా మార్చుతూ ఉండండి. మీ డిజిటల్ మరియు క్రెడిట్ కార్డులు ఒకవేళ దొంగలించబడిన లేదా పోగొట్టుకున్న వెంటనే బ్లాక్ చేయండి అని సూచించారు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం


ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ నోడల్ ఆఫీసర్ సునీల్,తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏన్కూర్ బ్రాంచ్ మేనేజర్ శోభన్ బాబు, ఏపిఎం మాదాసు వెంకట రామారావు , ఫీల్డ్ సిబ్బంది, వెలుగు సిబ్బంది, గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ స్టాప్, మరియు, గ్రామ దీపికలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు