Breaking News

బాన్సువాడ డిఎల్పిఓ గా వెంకట సత్యనారాయణ రెడ్డి

మనప్రగతిన్యూస్/ బాన్సువాడ:

కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజనల్ పంచాయతీ అధికారి గా విధులు నిర్వహిస్తున్న ఎస్ నాగరాజు ను బోధన్ డివిజన్ కు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బాన్సువాడ మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వెంకట సత్యనారాయణ రెడ్డిని బాన్సువాడ డివిజనల్ పంచాయతీ అధికారి డిఎల్పిఓ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డిఎల్పిఓగా వెంకట సత్యనారాయణ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఆపరేటర్లు తమ విధులు నిజాయితీగా నిర్వర్తించి, సహకరించాలన్నారు.

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్