మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్
ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఓ కిరాణా వ్యాపారి గుండెపోటు తో మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నోముల బాల్ లింగం (62) అనే వ్యక్తి గ్రామంలో కిరణా షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సోమవారం రోజు అస్వస్థ గురికాగా కుటుంబ సభ్యులు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం వేకువజామున మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో కుటుంబంలో విషాదశాల అల్ముకున్నాయి. మృతునికి భార్య ఇద్దరు కూతుర్లు,ఒక కుమారుడు ఉన్నారు.