మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట
సూర్యాపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి మహోత్సవం, స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, స్వామివారికి అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలు పూజారి రెంటాల సతీష్ కుమార్ శర్మ, సురేష్ అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమాలు చేయించారు. అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్న ప్రసరణ దాతలు రవీందర్రావు గొరీ కంటి దంపతులు అన్న ప్రసాదన్న కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలు చేసి నిర్వహించారు. రవీందర్రావు మాట్లాడుతూ అన్న ప్రసధణ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రెంటాల సతీష్ శర్మ కార్తీక మాసంలో ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమాలు ఇరుముడి మహోత్సవం, ప్రసాద వితరణ కార్యక్రమం రెండో ఒకేరోజు కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారని పూజలో పాల్గొన్న భక్తులు అయ్యప్ప స్వామి కృపకు పాతులై ఉంటారని అన్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరు స్వామి కటాక్షాలు పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారని తెలిపారు.