మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలోని నాలుగవ వార్డు లో గత వారం రోజులుగా పారిశుద్ధ్యం పడకేయడంతో ప్రజారోగ్యం ప్రశ్నార్ధకంగా మారింది అక్కడ చెత్త పేరుకు పోయి దుర్గంధం వెదజల్లుతుంది అది నిత్యం జనాలు సంచరించే ప్రధాన మార్గం కావడం, అదేవిధంగా నివాస గృహాల ప్రహరీ గోడల ప్రక్క భాగంలో ఈ చెత్త పేరుకుపోవడంతో కోతులు ,కుక్కలు, పందులు ఆ చెత్తను పెకిలించి రోడ్డుమీదకు చిమ్ముతున్నాయి దీనితో ఆ మార్గము గుండా వెళ్లేవారు, ఇళ్లలో నివసించే ఇరుగు పొరుగువారు ఇబ్బందులకు గురవుతున్నారు ఒక పక్కన ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తుంటే అధికారులు మాత్రం అంటీ,ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకవైపు టైఫాయిడ్ డెంగీ,మలేరియా, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నా ఇలా జనసంచారం మధ్య చెత్త పేరుకుపోయి ఉండటం ఎంతవరకు సమంజసం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలా చెత్త రోజుల తరబడి ఉండటం వల్ల అక్కడ ఉన్న నివాసితులు దుర్గంధం భరించలేక నరకం అనుభవిస్తున్నామని తెలిపారు.ఇలాంటి వాతావరణం కేవలం నాలుగో వార్డ్ లోనే కాకుండా మున్సిపాలిటీలో చాలా ప్రదేశాలలో దర్శనమిస్తుండటం గమనార్హం సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఆ పరిసరాలలో చెత్తకుండీలను ఏర్పాటు చేసి ఆ చెత్తను కుండీలో వేసే విధంగా చూడాలని ఇలా రోడ్ల వెంట చెత్త వేసే వారి మీద చర్యలు తీసుకుని జరిమానా విధించాలని ఎప్పుడు ఈ పరిసరాలలో వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని లేకపోతే దోమలు వ్యాప్తి అధికమై తాము అనేక రకాల వ్యాధుల బారిన పడే
అవకాశం ఉంటుందని స్థానికులు కోరుకుంటున్నారు.