మన ప్రగతి న్యూస్/ జఫర్‌గడ్:
గోనెల ప్రవీణ్ అనే యువకుడిని స్నేహితులు హోలీ ఆడుదామని వ్యవసాయ బావి వద్దకు తీసుకువెళ్లి కత్తితో దాడి చేసి హత మార్చిన సంఘటన జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం తీగారం గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. హోలీ ఆడుదమంటూ నమ్మించి తన స్నేహితులు గోనెల ప్రవీణ్ పై దాడి చేయడం స్థానికులు గమనించి ఎంజీఎం తరలిస్తుండగా మృతి చెందాడు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది