మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి
బడ్జెట్ సమావేశాల సెషన్ నుంచి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ పార్టీ గురువారం నిరసనలకు పిలుపునిచ్చింది. ఉప్పల్ నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ చౌరస్తాలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయమని అనని మాటలు అన్నట్టుగా చూపి జగదీశ్ రెడ్డినీ అన్యాయంగా సస్పెండ్ చేశారని ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి బయటికి వచ్చే అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆయన నిరసన చేపట్టారు. ఏదైనా తప్పుగా మాట్లాడితే సభలో విచారం వ్యక్తం చేస్తామని చెప్పినప్పటికీ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయి జెన్ శేఖర్, మహిపాల్ రెడ్డి, నవీన్ గౌడ్, మహేష్ గౌడ్, బడ్రుద్దిన్, బాబు యాదవ్ , మనెమ్మ,భాస్కర్, బాల కృష్ణ, నర్సింగ్ రావు, పిట్టల నరేష్ , మధు సుదన్ రెడ్డి, మోహన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.