మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి
కాప్రా సర్కిల్ లో దోమలతో అట్టుడికిపోతుంది, ఎక్కడ చుసిన భయంకరమైన దోమలు ప్రజలని చుట్టుముడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కాప్రా పరిధిలో దోమలు పెరగడానికి చాల కారణాలే ఉన్నాయి. ఇటీవల కాలంలో కాప్రా జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం పతాక స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు దోమల సీజన్ మొదలవ్వగానే, కాప్రా సర్కిల్ అంతటా వారానికి రెండు మూడు సార్లు అయిన ఫాగింగ్ జరిగేది. కానీ ఇప్పుడు పెరుగుతున్న దోమల తాకిడికి తగ్గట్టు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోవడం అందర్నీ ఆగ్రహానికి గురి చేస్తుంది. సాయంత్రం ఆరు దాటాక బయటకి వస్తే దోమల దెబ్బకి పలహారం అయిపోవడం ఖాయం అని సోషల్ మీడియాలో ప్రజలు ఒకరికి ఒకరు హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు.దోమల బెడదకు నిద్రలు లేక కాప్రా వాసులు అవస్థలు పడుతున్నారు.వర్షాకాలం నుండి దోమలు రావడం సహజం కానీ, చలికాలం వెళ్ళిపోయాక కూడా దోమలు విజృంభించడం అనేది పూర్తిగా జీహెచ్‌ఎంసీ వైఫల్యం అనే చెప్పాలి. ప్రజలని పట్టించుకోవాల్సిన జీహెచ్‌ఎంసీ మాత్రం మొద్దు నిద్రపోతుంది. ఒకప్పుడు జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోజు డ్రైనేజీ శుభ్రం చెయ్యడం, మరుగు నీటిని మళ్లించడం లాంటి పనులు చేసేవారు, కానీ గత ఏడాదిగా ఇవన్నీ ఆగిపోయాయి. చాల చోట్ల డ్రైనేజీ మురుగు నీరు రోడ్ మీదనే పారుతున్నాయి. రోడ్ మీద వాహనాలు నడిపేవారికి కప్పు కొడుతున్నాయి. ఇకనైనా జి.హెచ్.ఎమ్.సి చర్యలు చెప్పటాలని ప్రజలుకోరుకుంటున్నారు.