మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ రూరల్:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని చత్రు నాయక్ తండాలో నీటి ఎద్దడి ఏర్పడింది. గత కొన్ని రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని, బోరు మోటర్లు పనిచేయడం లేదని తాండవాసులు వాపోయారు. పంట పొలాల నుంచి నీటిని తీసుకువెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ అధికారులకు విన్న వించిన గ్రామ పంచాయతీలో నిధులు లేవని, సొంత డబ్బులతో బోరు మోటర్లు బాగు చేయించుకోవాలని అధికారులు సూచించినట్లు తెలిపారు. ఆనందంగా పండుగ జరుపుకునే వేళ నీళ్లు లేక తాండవాసులు ఆ సంతోషంలో ఉన్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.