మన ప్రగతి న్యూస్/హత్నూర:
సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్, కాసాల, దేవులపల్లి,హత్నూర, వడ్డేపల్లి, మల్కాపూర్, తదితర గ్రామాలలో చిన్న పెద్ద తేడా లేకుండా ఘనంగా హోలీ సంబరాలు చేసుకున్నారు. తీరొక్క రంగులతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ చిన్నపిల్లల కేరింతలతో సంతోషంగా గడిపారు. ప్రధాన వీధుల గుండా యువకులు పెద్ద ఎత్తున ఒక దగ్గర కూడుకొని హోలీ సంబరాలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు యువకులు చిన్న పిల్లలు తదితరులు పాల్గొన్నారు.