Breaking News

గెలుపొందిన కబడ్డీ వివిధ క్రీడాకారులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

ఆలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు

మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి

వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారి రెంటాల సతీష్ కుమార్ శర్మ మణిశర్మ, పూజ అనంతరం నిర్వహించిన క్రీడారంగంలో గెలుపొందిన టీమ్ జట్లు కబడ్డీ, కోలాటం, వివిధ రంగంలో బహుమతులు అందజేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి ఉల్లాసం, ఉత్సాహం కల్పిస్తాయని ఆయన అన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఆలయ చైర్మన్ ఎమ్మెల్యేకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే బహుమతులు ప్రధానం చేశారు. ఈ ఆలయం నాకు ఒక అనుభూతి అని ఎమ్మెల్యే అన్నారు. జబర్దస్త్ ప్రోగ్రాం వాళ్లు ఎమ్మెల్యేకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. కళావృత్యం సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా డాన్స్ ప్రోగ్రాంలో భాగంగా చిన్న బాలిక డాన్స్ అందరినీ ఆనందోత్సవం కలిగించిందని ఎమ్మెల్యే అన్నారు.

ఈ జాతరకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని ఎమ్మెల్యే అన్నారు. చైర్మన్ ఆధ్వర్యంలో జబర్దస్త్ ప్రోగ్రాం, డాన్స్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. భారీ బందోబస్తు నడుమ మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, రూరల్ సీఐ పి ఎండి ప్రసాద్, వేములపల్లి ఎస్ ఐ డి వెంకటేశ్వర్లు , పోలీస్ సిబ్బంది ఎటువంటి నేరాలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేశారు.