Breaking News

చలివేంద్రం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న విద్యార్థులు మరియు ప్రయాణికులు

మనప్రగతిన్యూస్/చిట్యాల

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి రోజు విద్యార్థులు ఇంటర్ పరీక్షల నిమిత్తం అలాగే ప్రయాణికులు వారి వారి గమ్యాల నిమిత్తం రోజు చిట్యాల మండల కేంద్రానికి వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎండలు విపరీతంగా పెరుగుతున్న విషయం మనకు విధితమే. ఈ తరుణంలో పరీక్షల ముగిసిన వెంటనే విద్యార్థులు వారి వారి సొంత ఊర్లకు చేరుకునేందుకు బస్సుల కోసం ప్రయాణికులు చిట్యాల చౌరస్తా కు వస్తా ఉంటారు. పెరుగుతున్న ఎండలకు తట్టుకోలేక విపరీతమైన దాహంతో అల్మటిస్తున్నారు. ఎవరైనా దాతలు మరియు అధికారులు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రయాణికులు, విద్యార్థులు కోరుకుంటున్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం