Breaking News

ముస్తాబాద్ లో శంకర్ నేత్రాలయం ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం

మన ప్రగతి న్యూస్/ముస్తాబాద్ జిల్లా స్టాపర్

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం లో డాక్టర్ లక్ష్మణరావు కుటుంబ సభ్యుల ఆర్దిక సహాయంతో శంకర్ నేత్రాలయం చెన్నై వైద్యులు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించారు.ఈ సందర్భంగా చెన్నై వైద్య బృందానికి కంటి పరీక్షలకు ప్రతి సహాయ సహకారాలు అందించిన వారికి శాలువాతో ఘనంగా సన్మానించారు.హాజరైన పీపుల్ హాస్పిటల్ చింతోజీ శంకర్ సార్ కి శాలువాతో ఘనంగా సన్మానించారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

అనంతరం డాక్టర్ లక్ష్మణ్ రావు కి శాలువాతో సన్మానించి చిత్రపటాన్ని బహుకరించారు ఈ సందర్భంగా వారు తెలుపుతూ అత్యాధునిక పరికరాలతో కూడిన కంటినర్ బస్సుల్లో వైద్యులు ఆపరేషన్లు నిర్వహించగా.ఉచిత వైద్యానికి కంటి పేషంట్లు 873 మంది హాజరు కాగా జెసి ఓసి చెన్నై రిఫరల్ ద్వారా 113 మంది పేషెంట్స్ కి కంటి ఆపరేషన్ ఉచితంగా చెన్నై లో చేస్తామని తెలుపగా” మొత్తం 69 కంటి ఆపరేషన్లు విజయవంతం అయిందని తెలిపారు.రోగులకు మందులు, కంటి అద్దాలు మందులు కంటి టీకాలు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం పేషంట్లకి ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణరావు,డాక్టర్ శంకర్, అయ్యప్ప ఆలయ శాశ్వత చైర్మన్ రాజు గురుస్వామి, నాగరాజు గురుస్వామి, నరేందర్ రావు,మాజీ సర్పంచ్ ఎల్లం, చెన్నై వైద్య బృందం. తదితరులు పాల్గొన్నారు.