Breaking News

ఇష్టపడి చదివి కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు

మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు:

ఇష్టపడి చదివి కష్టపడితేనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అని మహబూబాబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి అన్నారు. వేం చారిటబుల్ ట్రస్ట్ సహాకారంతో మునిగలవీడు జెడ్పిహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం స్వప్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యాదవ రెడ్డి పాల్గొని వేం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 10 వ తరగతి విద్యార్థి, విద్యార్థినీలకు ప్యాడులు, పెన్ను, పెన్సిల్లు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేం చారిటబుల్ ట్రస్ట్ సహాకారంతో ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా మునిగలవీడు పాఠశాలను సందర్శించి 10 వ తరగతి విద్యార్థి, విద్యార్థినీలకు పంపిణీ చేశామన్నారు. ఇష్టంతో కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని, ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి హెచ్చు వెంకటేశ్వర్లు, మునిగలవీడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇసంపెల్లి వెంకటేష్, మాజీ సర్పంచ్ పట్నంశెట్టి నాగరాజు, నాయకులు బండపల్లి కృష్ణ, ఇసంపెల్లి యాకయ్య ,ఇసంపెల్లి మల్లయ్య, బైస ఉప్పలయ్య,గాండ్ల లింగయ్య, విక్రమ్, రహిమత్ పాష,ఖలీల్, ఇసంపెల్లి వెంకటయ్య, అంబేద్కర్ యూత్ అధ్యక్షలు ఇసంపెల్లి వంశీ తరుణ్, ధర్మారపు శ్రీకాంత్ , ఇసంపెల్లి రమేష్ , కొమ్ము నవీన్ ,ఇసంపెల్లి మధు , తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం