మన ప్రగతి న్యూస్/ జఫర్‌గడ్:
జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో( 2001-2002) 10వ తరగతి పూర్తిచేసిన పూర్వ విద్యార్థులు గురువుల స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందిన సముద్రాల సోమ నరసయ్య, సిరం శెట్టి శ్రీధర్, సొన్నాయిల రాజ్ కుమార్ విద్యను బోధించిన గురువులు పర్వీజ్, ఇంద్రారెడ్డి , మధుసూదన్ రెడ్డి, చంద్రకిషోర్ , ఎస్.వి.రమణాచారి, దేవయ్య , సిరాజుద్దీన్, వెంకటాచారి గురువులను శనివారం కలిసి శాలువాలతో, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు బోధించిన స్ఫూర్తితో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందడం జరిగిందన్నారు. మేము పేద కుటుంబ, వ్యవసాయ కుటుంబంలో జన్మించిన విద్యార్థులు, ఉన్నంత చదువులు ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుకుంటూ ఉన్నత విద్యలను అభ్యసించి పిహెచ్డి పూర్తి చేయడం జరిగిందన్నారు ఇటీవల కాలంలో నిర్వహించిన, డీఎస్సీ, గురుకుల పాఠశాలలో నిర్వహించిన పోటీ పరీక్షలలో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించడం జరిగిందన్నారు. మేము జఫర్‌గడ్ గ్రామానికి చెందిన సముద్రాల సోమ నరసయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో ని కడిపికొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో పీటీగా, శిరంశెట్టి శ్రీధర్ డీఎస్సీ లో పీటీగా ఉద్యోగం పొంది. జఫర్‌గడ్ మండలంలో తమ్మడపల్లి (జి) గ్రామంలో పీటీగా జఫర్‌గడ్ మండలంలోని తమ్మడపల్లి ( జి) గ్రామానికి చెందిన సోన్నాయేలా రాజ్ కుమార్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం పెద్దబ్బాయి తండాలో ఉపాధ్యాయునిగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ పూర్వ విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలో కాదు, ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉద్యోగాలు సాధించవచ్చు అని పూర్వ విద్యార్థులు నిరూపించారు.
