Breaking News

సఖి సెంటర్ సేవలపై, మహిళలకు అవగాహన కార్యక్రమం

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

నర్సంపేట మండలం లో ని సర్వపురం, స్లం ఏరియాలలో సఖి సెంటర్ వరంగల్ వారు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది
ఇందులో భాగంగా సఖి సెంటర్ కేస్ వర్కర్ లు స్వప్న, తిరుమల మాట్లాడుతూ సఖి కేంద్రం మహిళ, శిశు, దివ్యాంగుల, మరియు వయోవృద్ధుల శాఖ, సర్వోదయ సంస్థ అద్వర్యం లో పనిచేస్తుంది అని చెప్పాడం జరిగింది.మహిళలకు మరియు పిల్లలకు అందించే సేవలు వివరిస్తూ మహిళల, బాలికల రక్షణ మరియు భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖి సెంటర్లను నడిపిస్తున్నాయని తద్వారా బాధిత మహిళలకు కౌన్సిలింగ్ పోలీస్, సహాయము, న్యాయ సహాయము, వైద్య సహాయము, తాత్కాలిక వసతి వంటి సేవలను ఉచితంగా 24 గంటలు అందుబాటులో ఉంటూ అందిస్తామని మరియు అత్యవసర పరిస్థితుల్లో బయటకు రాలేని మహిళలు మహిళ హెల్ప్ లైన్ 181 కాల్ చేసినట్లయితే రెస్క్యూ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే ప్రస్తుత సమాజంలో మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న హింస వాటికి కారణాలు మహిళల బాలికల హక్కులు చట్టాల గురించి ముఖ్యంగా గృహహింస చట్టం, బాల్యవివాహాల నిరోధక చట్టం, పోస్కో చట్టం వంటి వాటిపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ పి లు, గ్రూప్ సభ్యులు మహిళాలు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం