Breaking News

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్

మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు

మన ప్రగతి న్యూస్ /నల్గొండ/వేములపల్లి

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లోని రైతు వేదిక వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహన సదస్సు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, అతివేగం చాలా ప్రమాదకరమని వాహనాదారులకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని మద్యం సేవించడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని సర్వే లు చెప్తున్నాయని, కనుక మిమ్మల్ని నమ్ముకుని మీ కుటుంబాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సు తదితర కాగితాలన్నీ దగ్గర ఉంచుకోవాలన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ముఖ్యంగా మైనర్లకు వారి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని, అనుకొని ప్రమాదము జరుగుతే తల్లిదండ్రులను బాధ్యులను చేయడం జరుగుతుందని తెలిపారు. పెద్ద వాహనాల డ్రైవర్లు నిద్ర మత్తులో వాహనాలను నడపకూడదని, అవసరం అనుకున్న పక్షంలో విశ్రాంతిని తీసుకున్నకే డ్రైవింగ్ చేయాలన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా లారీల ఓవర్ స్పీడు గాని, రోడ్డుపై వాహనాలను నిలిపిన కేసు నమోదు చేస్తామని ఎస్పీ అన్నారు. మద్యం సేవించి వాహనదారులు వాహనాలను నడిపితే చట్టపరే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు.

వాహనాదారులకు ప్రత్యేకంగా ఎస్పీ రోడ్డు ప్రమాదాల నివారణకు పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డి ప్రసాద్ వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు మిర్యాలగూడ ఎస్ఐ రూరల్ లక్ష్మణ్ వాడపల్లి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పోలీస్ సిబ్బంది. వేములపల్లి వాహనదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.