పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి – ప్రిన్సిపాల్ ఐలయ్య
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
2025 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నాగార్జున సాగర్ పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య ఓ ప్రకటనలో తెలియచేసారు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2025- 26 విద్యా సంవత్సరానికి గాను సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు చేసుకోవాలని పాలిటెక్నిక్ పరీక్ష తేది 13-05-2025 మంగళవారం నిర్వహిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ తెలిపారు.రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటిగా పేరుగాంచిన నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రతి సంవత్సరం వివిధ కోర్సుల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున చేరి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఆయన తెలిపారు. సాంకేతిక విద్య కున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఉద్యోగ పరంగా ఎంతో ప్రాముఖ్యత గాంచిన పాలిటెక్నిక్ సాంకేతిక విద్య నిరుద్యోగ యువతీ యువకుల భవిష్యత్తుకు దారి చూపిస్తుందని ప్రిన్సిపాల్ అన్నారు.
విద్యా అర్హతలు:10వ తరగతి లేదా తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులని ఈ క్రింది చిరునామాను సంప్రదించవలసినదిగా
ఆయన కోరారు,
పాలిటెక్నిక్ పరీక్ష తేది 13-05-2025 మంగళవారం ఉంటుందని
అప్లికేషన్ ఖర్చు:SC/ST – రూ. 250.BC/OC – రూ. 500‘పాలిటెక్నిక్ ఉద్యోగం అవకాశాలు : పరిశ్రమలు డిప్లొమా ఉత్తీర్ణులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. కోర్సులు: పాలిటెక్నిక్ డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ శాఖలలో ప్రవేశము వివరములకు నాగార్జున సాగర్, పైలాన్ కాలనీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 7095678629 సంప్రదించవలసిన సమయం ఉ॥ 10 గం.ల నుండి సా॥ 4 గం.ల వరకు ఉంటుందని
కళాశాలలో గల మొత్తం ఒక్కొక్క కోర్సులో 60 సీట్లు చొప్పున ఖాళీలు ఉన్నాయని వీటి కోసం ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించిందని ప్రిన్సిపాల్ ఐలయ్య తెలిపారు. ఈ అవకాశాన్ని పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.