Breaking News

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసిరైతాంగాన్ని ఆదుకోవాలి.

బిజెపి ఖమ్మం జిల్లా పార్లమెంట్ కన్వీనర్
నంబూరి రామలింగేశ్వర రావు

మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాఫర్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వరి ధాన్యం ఆరబెట్టుకోవడానికి అనువైన కల్లాలు లేక రైతు పొలాల్లోనే ధాన్యపు రాశులుగా పోసుకొని,పట్టాలు కప్పుకొని అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని బిజెపి ఖమ్మం జిల్లా పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు అన్నారు . పేరువంచ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి పరిశీలించి కొర్లగూడెం మార్కెట్ చైర్మన్ కీసర వెంకటేశ్వర రెడ్డి తో మరియు మార్కెట్ సీఈవో వెంకటరెడ్డి తో మాట్లాడటం జరిగింది. తగినన్ని గోనే సంచులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని వెంటనే గోనే సంచులు ఏర్పాటు చేయాలని కీసర వెంకటేశ్వర రెడ్డికి విజ్ఞప్తి చేయడం జరిగింది.పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు వరి ఎక్కువగా దిగుబడి అయ్యింది. కల్లూరు మండలం లోనే దాదాపు 7 లక్షల క్వింటాల వరకు ధాన్యం పొలాల్లో రాశులుగా పోసి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం కాటా వేయకుండా రైతులను ఆందోళనకు గురిచేస్తుంది.కొన్ని చోట్ల కంటా వేసిన గాని రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు.ముఖ్యంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలో మిల్లర్లు మొత్తం రింగ్ అయ్యి రేపు తీసుకుంటాం, ఎల్లుండి తీసుకుంటామని చెప్పేసి రోజులు వెళ్ళదీస్తున్నారు. మంగళవారం కురిసిన అకాల వర్షాల వల్ల చాలా చోట్ల వరి ధాన్యం తడిచిపోవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి కల్లాలు ఏర్పాటు చేయాలి.వెంటనే మిల్లర్లతో మాట్లాడి కొనుగోలుకు చర్యలు చేపట్టాలి. అకాల వర్షాల వల్ల తడిచిన ఆఖరి గింజ కూడా కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మండల అధ్యక్షుడు గుమ్మా రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం బాట రైతన్నకు అండ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండప్పనేని అనిల్ వెంకటరెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఆనంగి నరసింహారావు, మండల యువ మోర్చాఅధ్యక్షుడు భీమరాజు తదితరులు పాల్గొన్నారు.