మనప్రగతి న్యూస్/చిట్యాల
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలము లోని నవాబ్ పేట గ్రామానికి చెందిన జిల్లెల్ల కుమారు(42) గత కొన్ని సంవత్సరాల నుండి కైలాపూర్ కారోబార్ గా పని పనిచేస్తున్నాడు.అతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. చిట్యాల నుండి నవాబుపేట తన ఇంటికి వెళుతుండగా చిట్యాల చెరువు సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి తాడిచెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.