బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

తడిచిన ప్రతి ధాన్యం గింజలు ప్రభుత్వం కొనుగోలు చేయాలి

నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 50 వేల నష్టపరిహారం ఇవ్వాలి

   సిపిఎం పార్టీ నాయకులు

మనప్గతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొని తడిసిన ప్రతి ధాన్యం గింజలను ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 50వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్
చేశారు.గురువారం పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామంలో వర్షానికి నేలమట్టమైన వరి పంటలను సిపిఎం బృందం పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయాన అకాల వర్షాలు మొంథా తుఫాను వలన వరి, పత్తి పంటలు భారీగా నష్టపోయా
యని తెలిపారు. రైతులు పెట్టుబడులు పెట్టి వరి పంటలు కోతకు వచ్చే సమయాన నీటిలో మునిగి పోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నారు. కోత దశలో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నడంతో ఎకరాకు లక్ష రూపాయల వరకు లాభం వచ్చేలా పంట నీళ్లల్లో కలిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వారు అన్నారు.
తుఫాను నష్టాన్ని అంచన వేసి రైతులకు చిరు వ్యాపారులకు, ఉపాధి కోల్పోయిన కూలీలకు తక్షణ పరిహారం చెల్లించాలని అలాగే ధంసమైన రోడ్లు పునర్మించాలని కూలిన గృహాల వారికి సహాయం అందించాలని ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లో నిర్మించి ఇవ్వాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బెల్లి సంపత్, కుమార్, వెంకన్న, బి.రమేష్, రాజు, బక్క కొమురయ్య, సొమయ్య,ఏలిమెనెటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.