Breaking News

పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనావేసి రైతులను ఆదుకుంటాం

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

మొంథా తుఫానుతో తీవ్రంగా వరి వంటతో పాటు ఇతర వంటలు భారీగా నష్టానికి గురయ్యాయని పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.గురువారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొంథా తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు చెన్నారావుపేట, నెక్కొండ మండలాలు తిరిగి స్వయంగా పరిశీలించానన్నారు. నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో 28 నుంచి 30 సెం.మీ. వర్షాపాతం నమోదై వంటలతో పాటు రోడ్లు ద్వంసం అయ్యాయి, నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం మండలాల్లో 20సెం.మీ. వర్షాపాతం నమోదైంది. వరి వంట ప్రస్తుతం పొట్ట దశలోనూ గొలుసు వేసే దశలో ఉందని వర్షానికి వరి వంట దెబ్బతిందన్నారు. డివిజన్లో 70వేల ఎకరాల్లో వరి వంట సాగైందని, ప్రస్తుతం వరద నీటి ప్రవాహం ఇంకా ఉన్నందున ప్రాథమిక స్థాయిలో వంట నష్టాన్ని అంచనా వేశామని నీటి ప్రవాహం తగ్గిన తర్వాత రెవిన్యూ వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖాధికారులతో పూర్తి స్థాయి సర్వే చేయించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి వంపుతామన్నారు. వరితో పాటు పత్తి, మిర్చి వంటలు కూడా దెబ్బతిన్నాయని అదేవిధంగా లోలెవల్ కాజ్వేలు, కల్వర్టులు దెబ్బతిన్నాయన్నారు. తుఫానుకు కొన్ని రోజుల ముందే రోడ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నెక్కొండ నర్సంపేట మధ్య దయ్యాలవాగు, చెన్నారావుపేట సమీపంలో ముగ్గుంపురం లోలెవల్ బ్రిడ్జి. గూడూరు నెక్కొండ మండలాల మధ్య అమీర్పేట వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, నెక్కొండ కేసముద్రం మధ్య గోడౌన్ల సమీపంలో వెంకటాపురం, తోపనపెల్లిల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం. నందిగామ, రేలకుంట సమీపంలో మాడన్నపేట వాగుపై అశోకనగర్ వద్ద కూడా హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం ప్రతిపాధనలు పంపినట్లు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం ప్రారంభించిన హామ్ పథకంలో నర్సంపేట నుంచి వరంగల్ వరకు నాలుగు లైన్ల రోడ్ల విస్తరణ నిర్మాణం, నర్సంపేట నుంచి నెక్కొండ పదిమీటర్ల వెడల్పు, నర్సంపేట నుంచి గూడూరు పదిమీటర్ల వెడల్పు నెక్కొండ నుంచి కేసముద్రం వదిమీటర్ల వెడల్పు, నర్సంపేటలోని మెడికల్ కళాశాల నుండి పాఖాల వరకు ఏడు మీటర్ల వెడల్పు నర్సంపేట నుంచి నల్లబెల్లి మీదుగా మహ్మద్ గౌస్ పల్లి వరకు ఏడు మీటర్ల వెడల్పు, నెక్కొండ నుంచి ఇంటికన్నె రైల్వే స్టేషన్ వరకు పది మీటర్ల వెడల్పు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాధనలు వంపినట్లు తెలిపారు. అదేవిధంగా నర్సంపేట పట్టణంలో రూ.25 కోట్లతో 60 కిలో మీటర్ల ఇంటర్నల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రూ.300 కోట్లతో రోడ్ల నిర్మాణం. చేపట్టేందుకు ప్రతిపాధనలు చేశామన్నారు. వర్షానికి 20 ఇండ్లు ద్వంసం కాగా వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని హామి ఇచ్చారు. అదేవిధంగా సూరిపల్లిలో 25 గొర్రెలు మృతిచెందగా బాధితులను ఆదుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.