వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,ఏన్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్:
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ శుక్రవారం 99వ డివిజన్ సిద్ధార్థ నగర్ ప్రాంతంలో డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, ఏన్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్, వైరా నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల కృష్ణ ప్రసాద్,మాజీ ఎంపీటీసీ మేడా ధర్మారావు, భువనేశ్వర్ రాజు, తాళ్లూరి నవీన్, నరేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై, నవీన్ యాదవ్ విజయానికి కృషి చేస్తామని సంకల్పం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అధిక మెజార్టీతో విజయం సాధిస్తాడు. ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల విశ్వాసం ఉంచుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి భరోసా ఇచ్చి విజయం సాధింపజేస్తారు అని తెలిపారు.ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.


