మన ప్రగతి న్యూస్/ యాదాద్రి భువనగిరి ప్రతినిధి:
బీబీనగర్ మండల కేంద్రంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.గర్దాస్ ప్రశాంత్ తండ్రి నరసింహులు (వయస్సు 32),టెలిఫోన్ కాలనీ బోడుప్పల్,సొంత గ్రామం,మండలం రాజాపేట,యాదాద్రి భువనగిరి జిల్లా,అతని భార్య గర్దాస్ ప్రసన్న (వయస్సు 28) వీరిద్దరు కూడా మూడు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని బోడుప్పల్ లోని టెలిఫోన్ కాలనీలో తల్లిదండ్రులతో కాకుండా,వీరిద్దరూ మాత్రమే కలిసి ఉంటున్నారు.ప్రశాంత్ సొంత ఊరు,రాజాపేట మండలం కాగా,ప్రశాంత్ భార్యది వరంగల్లోని పాలకుర్తి మండలం.ఆదివారం రోజు వీరు ఇరువురు కలిసి బైక్ పై బోడుప్పల్ నుండి బయలుదేరి భువనగిరి వైపు వస్తుండగా బీబీనగర్ చెరువు కట్ట వద్ద జాతీయ రహదారి పైన పక్కకి ఆగి ఉండగా,మహేంద్ర థార్ వాహనం అతివేగంగా వచ్చి వెనక నుండి వారి బైకును ఢీకొట్టడంతో ప్రమాద స్థలంలోనే ప్రశాంత్ మృతిచెందగా,యువతి పక్కనే ఉన్న చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది.మహేంద్ర కార్ వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి.వారిని చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



