Breaking News

చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

మన ప్రగతి న్యూస్ / హైదరాబాద్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ దారుణ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సాయం అందించేందుకు అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తన గాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి