Breaking News

ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి పొంగులేటి తీవ్ర దిగ్భ్రాంతి

గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం – మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మంత్రి మాట్లాడుతూ, ఈ దారుణ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఈ భరించలేని విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని కోరుతూ, వారికి తక్షణమే అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వం బాధిత కుటుంబాల పక్కన ఉంటుందని, అవసరమైన సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.