Breaking News

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి

మన ప్రగతి న్యూస్ /ఖమ్మం జిల్లా

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ పార్టీ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో పలువురు మృతిచెందిన విషయం బాధాకరమని పేర్కొన్నారు.బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నామ నాగేశ్వరరావు, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రమాదంలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం తక్షణమే అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ సూచించారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి