బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
అంతర్జాతీయం

చర్చికి గృహ జ్యోతి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

మండలంలోని ఓ చర్చికి గృహ జ్యోతి వర్తింప చేయడంతో ప్రజల్లో ఆగ్రహం రేపింది. అసలు లబ్ధిదారులకు గృహ జ్యోతి వర్తింప చేయకుండా చర్చికి గృహ జ్యోతి పథకము వర్తింప చేయడమేంటని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల కరెంటును ఇవ్వాలన్న ఉద్దేశంతో వినియోగదారులకే వర్తిస్తుందని పేర్కొన్న అధికారులు సరిగా ధ్రువీకరించకుండానే బిల్లులు జారీ చేసినట్టు బయటపడింది. మండల కేంద్రంలోని ధార్మిక సంస్థకు విద్యుత్ మినహాయింపు ఎలా ఇచ్చారు. దానికి అనుమతి ఇచ్చిన వారు ఎవరు అధికారులు ఎవరి ఆధారంగా ఆ బిల్లును జారీ చేశారో ఇప్పటివరకు ఎవరు స్పష్టత లేదు. గృహ జ్యోతి పథకం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు దాని మీద పట్టింపు లేకుండా జీరో బిల్లును జారీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు మండిపడుతున్నారు. కొంతమంది ఇంకా బిల్లులు తగ్గక ఆర్థిక భారం మోస్తుంటే ధార్మిక సంస్థలు సౌకర్యం పొందడం ఏంటి అని ప్రశ్నలు వెళ్ళువెత్తుతున్నాయి. గృహ జ్యోతి పథకం పై అధికారుల నిర్లక్ష్యం వహించడం వలన ఇలా జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. ప్రజాధనాన్ని అజాగ్రత్తగా వినియోగించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. గృహ జ్యోతి వర్తింపు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు జీరో బిల్లు మొత్తాన్ని బాధ్యుల నుంచి రికవరీ చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా కొనసాగితే గృహజ్యోతి పథకం పేదలకు మేలు చేయకపోవడం ఏకాకుండా ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది అని అంటున్నారు. ప్రజల ఆశలు వెలుగులు నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే గృహ జ్యోతి నిజమైన ప్రజాప్రతికంగా నిలుస్తుంది లేదంటే ఈ జీరో బిల్లులు అధికారులు పనితీరికే మైనస్ మార్కులుగా మిగిలిపోతాయి. దీనిపైన అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేని ఎడల అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్