మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:
తాడ్వాయి మండలంలోని భ్రహ్మజివాడి గ్రామంలో గల సిద్ధులగుట్ట సిద్దేశ్వర స్వామి ఆలయంలో జరిగిన 34వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్మాట్లాడుతూఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండి అధిక దిగుబడులు రావాలని, పాడి పంటలతో వ్యవసాయ రంగంలో సంపద నెలకొనాలని, మంచిలాభాలు రావాలని సిద్దేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లారెడ్డి ప్రజలపై ఉండాలని ప్రార్థించాను అని తెలిపారు.ఎమ్మెల్యే దృష్టికి ఆలయానికి చేరుకోవడానికి భక్తులు సుమారు 350 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి వస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. దీని నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ భక్తుల సౌలభ్యం దృష్ట్యా మెట్ల నిర్మాణం సీసీ రోడ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.అదేవిధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి, రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు సిద్దేశ్వర స్వామి ఆశీస్సులు పొందేలా తీర్చిదిద్దాలని తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఇటీవలసదాశివనగర్ మండలంలోని భూపాల్లిగ్రామ శివాలయంలో రాజంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామ ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఇచ్చిన హామీ మేరకు కొండ శిఖరం పైకి సీసీ రోడ్ నిర్మాణం పూర్తయిందని గుర్తు చేశారు.ప్రజల ఆధ్యాత్మికాభివృద్ధి, ఆలయాల అభ్యున్నతి, భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించి, ప్రతి పుణ్యక్షేత్రం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ హామీ ఇచ్చారు.

