మన ప్రగతి న్యూస్/ హుజూర్ నగర్
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో ఘనంగా అయ్యప్పకు గురుస్వామి లక్కం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభిషేక పూజ ఘనంగా జరిగింది. అయ్యప్ప నామస్మరణతో వీధి అంతా నిండిపోగా అయ్యప్ప భక్తులు మేళా తాళాలతో, మణికంఠుని పాటలతో, నృత్యాలతో అయ్యప్పను కీర్తిస్తూ అభిషేక పూజలో పాల్గొన్నారు. గురు స్వామి లక్కం శ్రీనివాస్ మాల ధరించినప్పటి నుండి ఇల్లే మణికంఠుని కుటీరంగా రూపుదిద్దుకొని అయ్యప్ప ఆగమనంతో ఒక కొత్త కలను సంతరించుకుంది.
అయ్యప్పను ఆరాధిస్తూ అయ్యప్ప కోసం చేసే దీక్షలో అయ్యప్ప స్వాములు అందరూ భక్తితో మణికంఠుని సేవిస్తూ, కీర్తిస్తూ అయ్యప్ప ఆశీర్వాదంతో తమ జీవితాలు, తమ కుటుంబం, ఊరు వాడ మొత్తం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పూజలు చేశారు. గురుస్వామి లక్కం శ్రీనివాస్ మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించిన ప్రతి భక్తుడు మణికంఠుని సేవిస్తూ 41 రోజుల దీక్ష చేపట్టిన ప్రతి భక్తునికి అయ్యప్ప ఆశీర్వాదం ఉంటుందని, అయ్యప్ప మాల వేసుకున్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడని, దీక్షలోని మహిమ మానవునికి క్రమశిక్షణమైన సాంప్రదాయబద్ధమైన నడవడికను నేర్పిస్తుందని, సంస్కృతి, ఆచారాలను గౌరవిస్తూ బ్రతకడంలోనే నిజమైన భక్తి ఉందని తెలిపారు. అయ్యప్ప మహామన్వితమైన గొప్ప దేవుడని, అయ్యప్పను మానవులే కాక జంతువులు కూడా ప్రేమిస్తాయని ,బాల్య దశలోనే జంతువులచే ప్రేమించబడ్డ గొప్ప దేవుడని అన్నారు. ప్రేమకు మరో రూపం అయ్యప్ప అని మనుషులను కష్టకాలంలో ఆదుకోవడంలో ముందు ఉంటాడని తెలిపారు. మాల వేసుకోకపోయినా పూజలో పాల్గొన్న భక్తులకు కూడా అయ్యప్ప ఆశీర్వాదం మెండుగా ఉంటుందని తెలిపారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే అయ్యప్ప మాలను వేసుకొని ప్రతి భక్తుడు అయ్యప్ప కృపకు పాత్రుడు కావాలని కోరారు. పూజలో పాల్గొన్న అయ్యప్ప లకు ఆశీర్వాదం ఇచ్చారు. ఈ పూజలో తెల్లబోయిన పుల్లయ్య, వీరయ్య, వెంకటనారాయణ, శ్రీను, కోటేశ్వరరావు, మరియు భక్త బృందం పాల్గొన్నారు.