Breaking News

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గుప్త నిధుల కలకలం

మన ప్రగతి న్యూస్/ బయ్యారం:

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పెద్దచెరువు కట్ట మీద సాక్షాత్తు కట్టమైసమ్మ వెలసిన స్థలంలో గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం జేసిబి యంత్రంతో తవ్వకాలు చేపట్టారు. ఎన్నో ఏళ్ల నుండి మండల ప్రజలు వర్షాకాలంలో సమయానికి వర్షాలు రాకపోతే అన్ని గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి వనభోజనం కార్యక్రమం చేపడితే వర్షాలు వస్తాయి అని ప్రజల నమ్మకం అలాంటి తల్లి వెలిసిన స్థలంలో గుప్త నిధులకోసం తవ్వకాలు చెపట్టడం ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసింది. దీన్ని చేదించడానికి క్రైం సి ఐ హాత్తిరాం నాయక్,
ఎస్ ఐ తాహిర్ బాబా, బయ్యారం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం