మన ప్రగతి న్యూస్/అశ్వరావుపేట నియోజకవర్గ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గంగారం గ్రామంలోని మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు జరిగాయి.
ఉపాధ్యాయురాలు కావ్య పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ
మన భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ బాలల దినోత్సవం జరుపుకుంటామనే విషయం మనందరికీ తెలిసిందే. ఆయన పిలల్లలతో వున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఈ బాలల దినోత్సవం జరుపుకుంటాం. చిన్న పిల్లల కల్మషం లేని మనసు వారి ఆలోచనలు నెహ్రూ ఎంతో ఇష్టం. అందుకే వీలున్నప్పుడల్లా పిల్లలతో గడపడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు.
నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు బలంగా నమ్మేవారు. పిల్లల కోసం ఏదైనా చేయాలి అని నిరంతరం తపిస్తూ ఉండేవారు.భారతదేశం అన్ని రంగాలలో ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి వడివడిగా అడుగులేస్తోంది. మరి అలా పోటీ పడాలి అంటే పునాదులు చాలా దృఢంగా ఉండాలి. భారతదేశ భవిష్యత్తుకి పునాదులు బాలలే అని అందరూ అంటారు.అందుకే మీరందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి మీ తల్లిదండ్రులకు గ్రామానికి దేశానికి మంచి పేరు తెచ్చే పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు గారపాటి కావ్య, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.