
ఐసిడిఎస్ నల్లబెల్లి సెక్టార్ సూపర్వైజర్ దేవులపల్లి అరుణ
మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి
మండలంలోని లెంకాలపల్లి, గొల్లపల్లి రెండు సెంటర్ కు ఐసిడిఎస్ మండల సెక్టార్ సూపర్వైజర్ అరుణ విహెచ్ఎండే మెడికల్ హెల్త్ చెకప్ క్యాంపు కార్యక్రమంలో భాగంగా హాజరు కావడం జరిగినది. ఈ సందర్భంగా అంగన్వాడీలోని శ్యామ్ మాం (బరువు తక్కువ పిల్లలు) బరువులు ఎత్తులను చూడడం జరిగినది. బరువు తక్కువ పిల్లలకు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడి పాఠశాలలకు పంపిణీ చేసే బాలామృతం ప్లస్ ను అందించాలని, అలాగే ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల లోపు పిల్లలకు టేక్ హోమ్ రేషన్ ద్వారా నెలకు 16 కోడిగుడ్లు బాలామృతం అందివ్వడం జరుగుతుందని అన్నారు. మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల లో పిల్లల లను తప్పకుండా అంగన్వాడి పాఠశాలలకు పంపించాలని, అంగన్వాడీ పాఠశాలల ద్వారా పిల్లలకు ఆట, పాట కార్యక్రమాలు, పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్య, ఆరోగ్య విద్య, పోషకార విద్య అందివ్వడం వలన, పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదగడమే కాకుండా రోగాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చన్నారు. అంగన్వాడీల ద్వారా గర్భిణీలకు బాలింతలకు ఆరోగ్య పరీక్షలతో పాటు భోజనం, గుడ్డు, 200 గ్రాముల పాలు ప్రతిరోజు అందివ్వడం జరుగుతుందన్నారు. అంగన్వాడి పాఠశాలలను ఎవరు అశ్రద్ధ చేయకుండా ఐదు సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీలకే పంపించాలని ఐసిడిఎస్ నల్లబెల్లి సెక్టార్ సూపర్వైజర్ అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఆకుల సునీత, ఆశ వర్కర్లు బయ్యరాద, బరిగెల రమ లతోపాటు పలువురు గర్భిణీ స్త్రీలు, పిల్లలు పాల్గొన్నారు.