Breaking News

గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/ సంగారెడ్డి:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

సంగారెడ్డి జిల్లా లోని కొత్తలాపూర్ గ్రామం లో మహాత్మ జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి స్వాతి ( 14) తన చున్నీతో శనివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. గురుకుల పాఠశాలకు చేరుకున్న పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తు దర్యాప్తు చేయడం జరిగింది. మృతురాలిని శవ పరీక్ష నిమిత్తం సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. శవ పరీక్ష అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.