మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్
డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ లో డైరెక్టర్ కృష్ణారావు కి వినతి పత్రం సమర్పించిన బీసీ నేత లింగంగౌడ్
పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఇంకా రెండు రోజులే ఉన్నందున (ఈనెల 18 చివరి తేదీ) ఫీజు గడువును 30 వరకు పొడిగించాలని విద్యాశాఖ డైరెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది విద్యార్థులు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు వాళ్లకి సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలు ఇంకా యుడైస్ పోర్టల్ లో నమోదు చేసుకోలేదని గతంలో కేవలం పదవ తరగతి విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే ఫీజు చెల్లించే అవకాశం ఉండేదని కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా 6 నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి వివరాలు ఆన్లైన్లో నమోదు తప్పనిసరి చేయడం వల్ల విద్యార్థులు వాళ్ల యొక్క వివరాలు ఇంకా పూర్తిస్థాయిలో నమోదు చేయకపోవడంతో పాటు ఆన్లైన్లో విద్యార్థులు నమోదులో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 18 నుంచి 30 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏంబీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బడేసాబ్ పాల్గొన్నారు.