Breaking News

కడియం ఆరోపణలు మాని అభివృద్ధి చెయ్యి

మన ప్రగతి న్యూస్/ రఘునాథపల్లి :

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మాజీ ఎమ్మెల్యే రాజయ్య పై ఆరోపణలు చేయడం మానుకొని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి
వై కుమార్ గౌడ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సవాల్ విసిరారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
కన్నతల్లి లాంటి టిఆర్ఎస్ పార్టీలో గెలిచి తల్లి రొమ్మును కోసిన చందంగా
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గుచేటని కుమార్ గౌడ్ అన్నారు. కడియం శ్రీహరి మేధావని అందరూ అంటారు మేధావి ఏ పార్టీలో ఉన్న అభివృద్ధి చేసే వీలుంటుంది కానీ కడియం శ్రీహరి తన సొంత ప్రయోజనాల కోసం పార్టీని విడాడని ఎద్దేవా చేశారు. దేవాదుల సృష్టికర్త అని చెప్పుకుంటున్న కడియం రిజర్వాయర్ ల అభివృద్ధి కి చేసింది ఏమీ లేదని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే రిజర్వాయర్లు ఏర్పాటు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్కటి అమలకు
నోచుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పాలనపై ఇప్పటికే ప్రజలు విసుగెత్తి పోయారని మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య అభివృద్ధి చేశాడని గుర్తు చేశాడు. అభివృద్ధి ప్రదాత రాజయ్య పై కడియం శ్రీహరి చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని లేనిపక్షంలో ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ముషిపట్ల విజయ్, మాజీ డైరెక్టర్ మండల అధికార ప్రతినిధి నూనె ముంతల యాకస్వామి గౌడ్.,నాయకులు ముక్క పరుశరాములు, బండి కుమార్ గౌడ్, జీడి కంటి నాగరాజ్, బాలరాజ్ తిప్పారపు బాబురావు నునావత్ కుమార్, ఎండి గౌస్తదితరులు పాల్గొన్నారు.