Breaking News

దొంగలకు అందుబాటులో తాళం చేతులు ఉంచరాదు

మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య

మన ప్రగతి న్యూస్/కేసముద్రం :

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఇంటి నుండి బయటకి వెళ్లేటప్పుడు తాళం చేతులు వెంట తీసుకువెళ్లాలని,ఇంటి దగ్గరే తాళం చేతులు ఉంచడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య అన్నారు.కేసముద్రం మండల పోలీస్ స్టేషన్ లో ఎస్సై మురళీధర్ తో కలిసి రూరల్ సిఐ సర్వయ్య పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలువైన ఆభరణాలు,నగదు, ముఖ్యమైన పత్రాలు ఇళ్లల్లో మరియు బీరువాలో ఉంచుకొని ఇంటి నుండి బయటకు వెళ్లే సందర్భంలో తాళం వేసి అట్టి తాళం చెవిని ఇంటి గుమ్మం పై భాగాన,చుట్టూ ప్రక్కల ఇంటి ఆవరణంలో పెట్టరాధని,తాళం చేతులు వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు.తాళం చేతులు ఇంటి ఆవరణంలో అందుబాటులో ఉండడం వల్ల దొంగలకు దొంగతనాలు సులభంగా చేయడం వీలవుతుందని తెలిపారు.అలాగే బీరువాలో విలువైన వస్తువులు,బంగారం, నగదు, ఉంచి అట్టి బీరువా తాళం చేతులు మంచం పరుపు క్రింద,తల దిండ్ల క్రింద, అందుబాటులో ఉంచవద్దని అలా ఉంచిన యెడల దొంగలు ఇంట్లో జొరబడితే సులభంగా చోరీకి గురవుతారని తెలిపారు. అట్టి ఇంటి తాళాలు, బీరువా తాళాలు తమ వెంట తీసుకువెళ్లడం వల్ల దొంగ విధానాలు జరిగే అవకాశం చాలా తక్కువ అని ఈ సందర్భంగా తెలిపారు.అలాగే ప్రయాణంలో ఆభరణాలు సంచులలో బ్యాగులలో ఉంచవద్దని, విలువైన వస్తువులతో ప్రయాణం చేయరాదని తెలిపారు.సుదూర ప్రాంతాలకు , యాత్రలకు వెళ్లేటప్పుడు ఇంటి చుట్టుపక్కల వారిని అప్పుడప్పుడు ఇంటి వైపు గమనించాలని చెప్పి వెళ్లాలని ఈ సందర్భంగా సీఐ సర్వయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.