Breaking News

అభివృద్ధి కోసం కౌన్సిలర్ల కృషికి అభినందనలు – ఎంపీ ఈటల రాజేందర్

మనప్రగతి న్యూస్ /మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి:-

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మేడ్చల్ జిల్లా నాగారం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ కౌకుట్ల చంద్రా రెడ్డి అధ్యక్షతన సాదరణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో 20 వార్డుల అభివృద్ధి పనుల కోసం రూ. 7.08 కోట్ల బడ్జెట్‌తో సిసి రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి పనులకు తీర్మానం చేశారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “నాగారం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని, ఇది ప్రజల మేలుకే దోహదం చేస్తుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రా రెడ్డి, వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్లు, వాటర్ బోర్డు మేనేజర్, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.