మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట
గ్రూప్ III రాత పరీక్ష కు సంభందించిన జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను సూర్యాపేట ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ పరిశీలించారు. పరీక్షా సరళిని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో గల ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల, ఎస్వి డిగ్రీ కళాశాలలు, 60 ఫీట్స్ రోడ్డు నందు పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
సిబ్బంది బాధ్యతగా పని చేయాలని, పరీక్షా రాసే అభ్యర్థులకు, పరీక్షా సామాగ్రికి, సిబ్బందికి బరోసా, భద్రత కల్పించాలని అన్నారు. పరీక్షా పత్రాలు స్ట్రాంగ్ రూం కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఎస్పి వెంట సూర్యాపేట సబ్ డివిజన్ డి.ఎస్.పి రవి, సిబ్బంది ఉన్నారు.