మన ప్రగతి న్యూస్/ వరంగల్
వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్పోర్టు
నిర్మాణంలో ముందడుగు పడింది. ఎయిర్పోర్టు
విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్టు
నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన
డీపిఆర్ను సిద్ధం చేయాలని ఆర్ & బీ శాఖ కు లేఖ రాసింది.