విజయోత్సవ సభకు పదివేల మందితో తరలి రావాలని పిలుపునిచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే
తెలంగాణ ప్రజా పాలన సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలియజేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
మన ప్రగతి న్యూస్/నర్సంపేట
ఈనెల 19న వరంగల్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని ఆ సభకు పదివేల మంది కార్యకర్తలు నాయకులు నర్సంపేట నియోజకవర్గం నుండి తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు.ఈ సందర్భంగా దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఆరు మండలాలతో పాటు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సభకు హాజరుకావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలల కాలంలో 10 సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపెట్టిందని, ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మన ప్రభుత్వం మన కోసం పనిచేస్తుంది కనుక కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లి సభలో పాల్గొనేటట్లు చూడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.