- తీవ్రంగా ఖండించిన మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు సాంబశివ రెడ్డి..
మన ప్రగతి న్యూస్/ నడికూడ:
ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచులను పోలీసులు అక్రమం గా అరెస్టు చేయడాన్ని సర్పంచుల ఫోరం నడికూడ మండల అధ్యక్షుడు తిప్పర్తి సాంబశివ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ వరంగల్ పర్యటన నిమిత్తం.. మాజీ సర్పంచులు వారు చేసిన అభివృద్ధి పనుల బిల్లులను విడుదల చేయాలంటూ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతం లో ముందస్తుగా అరెస్టు చేశామని పరకాల పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో నడికూడ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సాంబశివ రెడ్డి, నడికూడ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు, పరకాల మండలం కామారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బుర్ర రాజయ్య,మలక్క పేట మాజీ సర్పంచ్ ధూమల శ్రీనివాసు లు అరెస్టయ్యారు.