మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
ఇటీవల జరిగిన గురుకుల పాఠశాల అర్హత పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అర్హత సాధించారు.నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో విద్యను అభ్యసిస్తున్న ఆరుగురు నాలుగో తరగతి విద్యార్థులు గురుకుల కామన్ ఎంట్రన్స్ పరీక్షల్లో హాజరై అర్హత సాధించారు. మనస్విత్, గౌతమ్,నంద,లాస్య,అఖిరనందన్, వరుణ్,అభిజ్ఞ,లు అర్హత సాధించగా వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ ఉపాధ్యాయులు శోభారాణి రాంబాబు బద్రీనాథ్ గోవర్ధన్ మౌనిక రవికుమారులు వారిని అభినందించారు.

